Dhanush: 'ఇడ్లీ కడై ' మూవీ డేట్ ఖరార్.. 7 d ago

కొలీవుడ్ స్టార్ ధనుష్ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, 'రాయన్' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాతో కూడా మంచి స్పందన అందుకున్నారు. ప్రస్తుతం ధనుష్ 'ఇడ్లీ కడై' సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అయితే ఇది అక్టోబర్ 1న విడుదల కానుంది. అలాగే 'కుబేర' చిత్రంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రష్మిక, నాగార్జునతో కలిసి నటిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, ధనుష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ తెలుగు ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సామజిక మాధ్యమంలో పుకార్లు వస్తున్నాయి. ఇది అభిమానులను ఉత్కంఠలో పెట్టింది.